తమ్ముడూ నాకూ ఓ లవ్ స్టోరీ ఉందమ్మా.. వింటావా.. చైల చైలా.. చైలా చైలా.. నేను వెంటపడ్ద పిల్ల పేరు లైలా... అనుకుంటూ అన్నయ్య పాడిన పాట వింటుంటే నాకు ఈ ఆలోచన వచ్చింది.. ప్రేమ కధలతో ఒక ఒక బ్లాగు రాస్తే బాగుంటుంది అని... సో.. మొదలు పెట్టేశాను.. ఇందులో యధార్ద ప్రేమ కధలను సేకరించి రాయటం జరుగుతోంది.. ఇంకా కొంతమంది వాళ్ళ స్టోరీస్ ని కూడా రాయమంటూ నన్ను సంప్రదిస్తున్నారు.. ఖచ్చితంగా వాటిని కూడా ప్రచురిస్తాం.. అయితే ఇక్కడ రాస్తున్న స్టోరీస్ లో ఏవీ కూడా ఎవరినీ ఉద్దేశించి రాస్తున్నవి కాదు.. కేవలం పాటకులకు వినోదాన్ని పంపించే క్రమమ్లో మాత్రమే రాయటం జరుగుతున్నది. దయచేసి గమనించగలరు..!
- మీ సత్యం గడ్డమణుగు

Sunday 17 March 2013

శ్రీ-నవ్య: ఎపిసోడ్ 01

హాయ్ ఫ్ర్రెండ్స్.. నేను శ్రీకర్ ని.. అందరు నన్ను శ్రీ అని పిలుస్తు ఉంటారు.. నేను ఇప్పుడు బెంగుళూరులో ఉన్న ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో మేనేజర్ గా పని చేస్తున్నాను.. నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు.. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి.. నాన్న చిన్న ప్రెయివేటు కంపెనీ లో గుమస్తా గా చేస్తున్నారు.. ఇదీ మా ఇంటి పురాణం.. ఓహ్.. మీరు నా లవ్ స్టోరీ కోసం చదువుతుంటే నేనేమో మా ఇంట్లో వాళ్ల గురించి చెప్తున్నా్నేంటా అనుకుంటున్నారా..? సరే ఇంక నా ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్తాను..

నేను బీటెక్ లో చేరి అప్పటికి ఒక వారం రోజులు అయిందేమో, అప్పటికే మా క్లాసులో అందరు నాకు పరిచయం అయిపోయారు.. అందరితో కలిసిపోయే వాడిని.. ముఖ్యంగా అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడే వాడిని.. అలానే మా క్లాసులో నవ్య అని ఒక అల్లరి పిల్లతో పరిచయం ఏర్పడింది.. తను ఎప్పుడూ గల గలా మాట్లాడుతూనే ఉండేది.. ఎంటో చాలా త్వరగా ఇద్దరం మంచి ఫ్రెండ్స్ ఐపోయాం.. నన్ను అప్పటివరకు ఏ అమ్మాయి "రా" అని పిలిచింది లేదు.. కానీ తను రా అని పిలుస్తుంటే నా మనసులో ఏదో ఆనందం.. భలే ఎంజాయ్ చేసే వాడిని నేను తన కంపెనీ ని.. అప్పటి వరకు ఎవరైనా చాక్లేట్లు తింటుంటే వద్దు అని చెప్పే నేను రోజూ తనకి ఇష్టమైన డైరీ మిల్క్ రెండు కొని ఒకటి తనకిచ్చి ఇంకొటి నేను తినే వాడిని.. డైరీ లో సగం పైన మా ముచ్చట్లే నిండిపోయేవి.. ఏదో తెలియని ఆనందం.. స్వేచ్చగా ఆకాశమ్లో ఎగురుతున్న అనుభూతి కలిగేది తనతో మాట్లాడుతుంటే..! ఒకరోజు ఏదో నోడ్సు రాయాలని నా నోడ్సు అడిగింది.. సరే ఇస్తాను అని చెప్పాను కానీ ఆరోజు ఎందుకో కుదరలేదు.. సో తరు్వాతి రోజు తను సార్ తో క్లాస్ మొత్తమ్లో తిట్లు తింటుంటే చూడలేకపోయా.. క్లాస్ అయిపోయాక "సారీ రా" అని చెప్పాను.. దానికి తనేమో "యు ఆర్ మై ఫ్రెండ్ రా.. డొంట్ సే సారీ.. ఎం కాదులే అనేసరికి నాకు తనమీద ఇంకా ఇష్టం పెరిగింది.

3 comments: